రెండు మిలియన్ లు దాటిన శ్రీ విష్ణు సహస్ర నామం

updated: October 21, 2018 16:30 IST
రెండు మిలియన్ లు దాటిన  శ్రీ విష్ణు సహస్ర నామం

విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో మహామహిమాన్వితమైనది.   మనము నిత్య పారాయణకు  వినియోగించచుకునేది. మనశ్సాంతి కోసం, మహాదైశ్వర్యాల కోసం వినదగినది. మహాభారత కాలమందు చెప్పబడినటువంటి సమస్త స్తోత్రములకు కూడా మణిపూసాంటిది ఈ స్తోత్రం.  "దుఃఖితులైనవారు, భయగ్రస్తులు, వ్యాధిపీడితులు విష్ణు సహస్రనామ స్తోత్రం సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును పొందుతారు."  

అంత మహిమాన్వితమైన విష్ణు సహస్రనామం మన మదిలో మొదలగానే  మొదట మనకు గుర్తు వచ్చే గాత్రం ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారిది. తర్వాత ఎంతో మంది ఆవిడను అనుకరిస్తూ లేదా అనుసరిస్తూ సహస్రనామాలను గానం చేసి ఉండవచ్చు. కానీ ఆవిడ దరిదాపులకు వెళ్లినవారు అతి తక్కువ మంది. కానీ ఈ తరంలో గాయని సత్యయామిని మళ్లీ తన మధుర కంఠంతో భక్తిపారవశ్యంతో పాడి శభాష్ అనిపించుకున్నారు. ఆమె పాడిన ఈ విష్ణు సహస్రనామ స్త్రోత్రం యూట్యూబ్ లో ఎంత పెద్ద హిట్ అంటే అనతి కాలంలోనే  రెండు  మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.  

 
శ్రద్ద,భక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మరోసారి ఈ పాట పాడటంతో సత్య యామిని ప్రూవ్ చేసారు. ఈమె మధురగానానికి తనదైన శైలిలో భక్తిరస సంగీతం అందించింది సాయి శ్రీకాంత్ గారు. ఈ వీడియోని అందించింది ఫిక్సర్ టీవి యూట్యూబ్ ఛానెల్ వారు. వీరికి భక్త ప్రపంచం ఎంతైనా రుణపడి ఉంది అనటంలో సందేహం లేదు. భక్తి రస ప్రపంచంలో గాయనిగా ఎమ్.ఎస్ .సుబ్బ లక్ష్మిగారు మహారాణి అయితే సత్య యామిని యువరాణి అనిపించుకున్నారు.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: vishnu sahasranamam, satya yamini, crosses two million mark, Sai Sreekanth, Picsar TV, M. S. Subbulakshmi

comments