సత్య యామిని కవర్ సాంగ్ తో ట్రిబ్యూట్

updated: August 6, 2018 10:44 IST
సత్య యామిని  కవర్ సాంగ్ తో ట్రిబ్యూట్

ఆ పాత మధురానికి...సత్య యామిని  కవర్ సాంగ్ తో ట్రిబ్యూట్

కొన్ని ఆ పాత మధురాలు వింటూంటే మనస్సు ఎక్కడికో వెళ్లిపోతుంది. అందుకేనేమో ..ఏ టీవీ ఛానెల్ లోనో హఠాత్తుగా పాత సాంగ్ రాగానే మన రిమోట్ ...దానంతట ఆగిపోతుంది. మన హృదయం గతాన్ని స్పృశిస్తూ గమ్మత్తుగా మారిపోయి..ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది. ఆ రోజంతా ఆ పాత(ట) పరిమళం ఉండిపోతుంది. అది గమనించినట్లుంది ప్రముఖ సింగర్ సత్య యామిని.

బాహుబలి లోని 'మమతల తల్లీ.. ఒడి బాహుబలీ' పాటతో.. ఒక్కసారిగా వెలుగులోకొచ్చిన   సత్యయామిని  టాలీవుడ్‌ గాన ప్రపంచంలో.. ప్రత్యేక ఇమేజ్‌తో అలరిస్తోంది. ఆమె ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఘర్షణ' చిత్రంలో ఇళయరాజా స్వరపచగా చిత్రగారు పాడిన నిన్ను కోరి  పాటను ఏరికోరి ..మళ్లీ పాడి ...కవర్ సాంగ్ రిలీజ్ చేసింది. ఆ పాట వచ్చి ఇన్నేళ్లు అయినా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆ పాటకు అందమైన ట్రిబ్యూట్ గా ఈ కవర్ సాంగ్ నిలిచిపోతుందనటంలో సందేహం లేదు.

చిత్రగారు పాడిన పాట అంటే ఆల్రెడీ ఓ అద్బుతం జరిగిపోయినట్లే. అలాంటి ఆ పాటను మళ్లీ పాటాలంటే కాస్తంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేసింది సత్య యామిని. ఆ పాత మ్యాజిక్ కు చాలా దగ్గరగా వెళ్లింది. కొత్త మాయ చేసింది. కావాలంటే మీరూ ఆ పాట వినండి మీరే నిజమంటారు. ఆ పాటకు సత్యయామిని ఇచ్చిన ట్రిబ్యూట్ అని ఒప్పుకుంటారు. 

 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: Satya Yamini, Ninnu kori Cover song by bahubali satya yamini, singer chitra

comments