ఓ అద్బుతం జరిగిన వేళ..

updated: July 6, 2018 19:07 IST
ఓ అద్బుతం జరిగిన వేళ..

కొన్ని పాటలు అలా ఆదమరుపుగా ఏ ప్రక్కింట్లోంచో విన్నా...ఆపు అంతూ లేకుండా రోజుల తరబడి మన హృదయంలో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ పాట ఏంటో..ఎవరు పాడారో తెలుసుకునేదాకా మనస్సు ఆగదు. అటువంటి అరుదైన గీతాల్లో ఒకటి   "గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం..." .  జగద్గురు శ్రీ భారతి తీర్ధ మహాస్వామి వారి చే స్వరపరచబడిన ఈ గీతం ఇప్పుడు చాలా  ఇళ్లలో ప్రభాత సమయాన వినే భక్తి గీతం అయ్యింది.  మరి కొంతమందికి రింగ్ టోన్ గా మారింది. 

ఈ గీతాన్ని ఇంతలా జనసామాన్యంలోకి తెచ్చింది ఎవరూ అంటే మొహమాటం లేకుండా యూట్యూబ్ అని చెప్పుకోవాలి. మీరు యూట్యూబ్ కు వెళ్లి గరుడ గమన అని టైప్ చేస్తే పదుల సంఖ్యలో వీడియోలు వస్తాయి. అందులో   ప్రముఖ సింగర్స్ పాడినవి కూడా ఉంటాయి. ఈ సందర్బంగా picsartv.com వారు అందించిన ఈ  పాటకు సంభందించిన వీడియో బాగా పాపులర్ అవటం గుర్తు చేసుకోవాలి.  5 మిలియన్ల వ్యూస్ తో ఈ వీడియో భక్త జనలను అలరిస్తూ ముందుకు దూసుకుపోతోంది. 

అంతగా ఈ వీడియో పాపులర్ అవటానికి కారణం ...ఈ పాట పాడిన  శృతిరంజని   అయితే, సంగీతం అందించిందిన సాయి శ్రీకాంత్ గారు.   సంప్రదాయ సంగీత కుటుంబం నుంచి వచ్చిన శృతి రంజని  ఈ పాటను తన అద్బుత గాత్రంతో , తనదైన సంగీత శైలితో గానం చేసింది. 

ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే...లయ. ఈ లయ సుందరం, సురిచితం..మథురం, మనోజ్ఞం, మనోహరం, మహదానంద కారణం. ఒక్క  అక్షరం ఎక్కువ కానీ ఒక అక్షరం తక్కువ కానీ ఉండకుండా...చక్కగా లయబద్దంగా ఉంటుంది.    ఈ పాటలో మొదటి పంక్తి భగవంతుని గుణ విశేషణాలను వర్ణించితే..రెండవ పంక్తి ఆయనకు ఆత్మ నివేదన. మరి మీరు ఇప్పటికే విని ఉంటే మరోసారి విని ...ఆత్మానందం పొందండి. వినకపోతే...ఓసారి ఈ క్రింద లింక్ ఓపెన్ చేసి ఈ అద్బుతాన్ని పరిగ్రహించండి.

శృతి రంజిని తండ్రి  శ్రీ మోదుమూడి సుధాకర్  కర్ణాటక సంగీత గాత్ర కళాకారులు.   కొన్ని వందల లలిత గీతాలకు, భక్తి గీతాలకు ఆయన సంగీతం స్వరపరిచారు. ఇక ఆయన సంగీత ప్రపంచానికి తన వంతు సేవగా స్వరఝరి అనే సంస్దను 1988 నుంచి నడుపుతున్నారు. వీరి సేవలకు మెచ్చి గత ఉగాది  నాడు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం " హంస " అవార్డు తో సత్కరించింది. ఆ వారసత్వ సంపదే శృతి రంజని .

ఓ పాటకు 5 మిలియన్ వ్యూస్ అతి తక్కువ కాలంలో రావటం అంటే మాటలు కాదు. ఆ విజయం సాధించింది ఈ పాట.  చక్కటి నిర్మాణ విలువలు, మంచి టీమ్ ఉంటే ఏదీ అసాధ్యం కాదని ఈ పాట నిరూపించింది

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: garuda gamana tava, sruthi ranjani, sai sreekanth, picsartv

comments