గరుడ వేగంతో పరుగెడుతున్న గీతం

updated: February 19, 2018 13:21 IST
గరుడ వేగంతో  పరుగెడుతున్న గీతం

జగద్గురు శ్రీ భారతి తీర్ధ మహాస్వామి వారి చేత అందివ్వబడిన   "గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం..." వింటూ ,పాడుతూ ఉంటే    మనస్సుకు ఎంతో ఆనందంగా...ఉత్సాహంగా ఉంటుంది. అందుకేనేమో ఈ వీడియో అప్ లోడ్ చేసిన కొద్ది కాలంలోనే పాతికలక్షలు దాటి భక్త జనుల ప్రోత్యాహంతో ముందుకు గరుడ వేగంతో దూసుకు వెళ్తోంది. 

 ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే...లయ. ఈ లయ సుందరం, సురిచితం..మథురం, మనోజ్ఞం, మనోహరం, మహదానంద కారణం. ఒక్క  అక్షరం ఎక్కువ కానీ ఒక అక్షరం తక్కువ కానీ ఉండకుండా...చక్కగా లయబద్దంగా ఉంటుంది.    ఈ పాటలో మొదటి పంక్తి భగవంతుని గుణ విశేషణాలను వర్ణించితే..రెండవ పంక్తి ఆయనకు ఆత్మ నివేదన. 

ఇక ఇందులో మరో విశేషం ఏమిటంటే...మీరు యూట్యూబ్ కు వెళ్లి గరుడ గమన అని టైప్ చేస్తే పదుల సంఖ్యలో వీడియోలు వస్తాయి. అందులో   ప్రముఖ సింగర్స్ పాడినవి కూడా ఉంటాయి. ఐనా కూడా  picsartv.com వారు అందించిన ఈ వీడియో బాగా పాపులర్ అవటం చెప్పుకోదగ్గ సంగతి.   


ఈ గీతం రాసిన జగద్బురువులు భారతీ తీర్దుల వారి చరణ కమలములకు త్రికరణ శుద్దిగా  ప్రణామాలు తెలియచేసుకుంటూ అతి త్వరలోనే యాభై లక్షల మైలు రాయని కూడా దాటి కోటిని చేరుతుందని ఆశిద్దాం. 

ఈ మధుర గానం చేసినది శృతిరంజనీ అయితే, సంగీతం అందించింది సాయి శ్రీకాంత్. 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: sruthiranjani, picsartv, saisrikanth, garuda gamana

comments